దేవసేన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

249
- Advertisement -

బాహుబలి కంక్లూజన్ పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. నభూతో న భవిష్యతి అన్న రీతిలో కంక్లూజన్ లో యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయట. అందుకు తగ్గట్టుగానే రెండో భాగంపై మరింత దృష్టిపెట్టాడట రాజమౌళి.సినిమా మొత్తంలో రెండు యుద్ధసన్నివేశాలుంటాయట. వాటిలో దేనికదే అదిరిపోయే రేంజ్ లో జక్కన్న తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు యుద్ధసన్నివేశాల్లో కీలక పాత్ర అనుష్కదేనట.

Anushka-shetty-baahubali

ప్రభాస్, రానాతో వేరువేరుగా అనుష్క యుద్దసన్నివేశాలు ఉంటాయట. సినిమా మొత్తానికి ఇవే కీలకమని తెలుస్తోంది. ముఖ్యంగా రానా-అనుష్క మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. తొలిపార్టులో నిరాశకు గురైన అనుష్క ఫ్యాన్స్ రెండో భాగంలో మాత్రం డబుల్ హ్యాపీ అవ్వడం ఖాయమంటున్నారు. అయితే సినిమా విడుదలైతే గాని మ్యాటర్ ఉందా లేదా తెలియదు.

Anushka-Baahubali-Photo-Stills-4

Courtesy – YOYO TV

- Advertisement -