తెలంగాణలో ఏపీ పోలీసుల కుట్రలు-పల్లా

234
- Advertisement -

సర్వేల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా కుట్రలు జరుగుతున్నాయని.. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు కుట్రలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సచివాలయంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు గట్టు రామచంద్రరావు, దండే విఠల్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందిచారు.

ఏపీ పోలీసులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో.. వివరణ కోరాలని, తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈవోకు విజ్ఞప్తి చేశామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఆరుగురు చొప్పున ఏపీ పోలీసులను నియమించి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలను తెలంగాణ ప్రజలు సహించరని, రాబోయే రోజుల్లో ఏపీ నేతలకు తెలంగాణ ప్రజలే బుద్ది చెప్తారని ఆయన స్పష్టం చేశారు. మహా కూటమి నేతలు సీఈవోను కలిసి విచిత్రమైన ప్రతిపాదనలు చేస్తున్నారని.. తమ వాహనాలను తనిఖీ చేయొద్దని ఈసీకి ఫిర్యాదు చేసి అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -