త్వరలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ నిఘంటువు విడుదల కానుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉనికిలో ఉన్న పద సంపదను క్రోడీకరించి సమగ్ర నిఘంటువు రూపొందించాలని ఇంతకుముందే భాషా సాంస్కృతికశాఖకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు. తెలుగు వర్సిటీని.. తెలంగాణ వర్సిటీగా మార్చి.. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ ప్రకటించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ నిఘంటువు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అంశంతో ముడిపడి, ప్రజల్లో ప్రాముఖ్యం ఉన్న కళలపై కొత్త కోర్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాచీనమైన, రాష్ట్ర నృత్యం పేరిణిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వర్సిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ నిఘంటువు ఇలా ఉండబోతుంది..
తెలంగాణ వ్యవహారికం
బువ్వ భోజనం
లగ్గం పెళ్లి
దూప దాహం వేయటం
మెత్త దిండు
అలాయ్ బలాయ్ ఆలింగనం
ఉరుకు పరుగెత్తడం
మంచిగుంది బాగుంది
పుంటికూర గోంగూర
బాపూ తండ్రి
కాకా/చిచ్చా చిన్నాన్న, చిన్నాయన
యారాలు తోడికోడలు
సడ్డకుడు తోడల్లుడు
అంగి చొక్కా
గుండీ బొత్తాం
తపక్ తపక్ మాటిమాటికి
టకటక/జెప్పజెప్ప వేగంగా
గాయ్ గాయ్ గందరగోళం
ఇయ్యాళ ఈరోజు
మబ్బుల పొద్దున్నే
మాపటికి సాయంత్రానికి
పైలం జాగ్రత్త
మిత్తి వడ్డీ
కిరాయి అద్దె
ఏడికి ఎక్కడికి
బర్రె గేదె
యాట గొర్రె
కంకి మొక్కజొన్న
సేపు యాపిల్
కొనకు చివరకు