ఒకప్పటి బాలీవుడ్ సినీయర్ నటుడు ‘రిషి కపూర్’ ఈ మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా సహనం కోల్పోయిన రిష్ కపూర్ జర్నలిస్టులపై చేయి చేసుకుని తోసేసిన ఘటన కలకలం రేపుతోంది.
ముంబైలో గణేష్ నిమజ్జనం సంధర్బంగా రణధీర్ కపూర్, రణబీర్ కపూర్, రిషీ కపూర్‌లు దాదాపు నాలుగు కిలో మీటర్లు నడిచారు. వీరిని చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. మీడియా కూడా వీరిని కవర్ చేయడానికి పోటీ పడ్డారు. అంతేకాకుండా ఇతర వినాయక విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్తుండడంతో ముంబై రోడ్లపై విపరీతమైన రద్దీ ఏర్పడింది.
ఇంతకీ గొడవ ఎలా మొదలైందంటే.. రణబీర్ సింబల్స్ వాయిస్తుండగా ఓ మీడియా జర్నలిస్ట్ షూట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే దీనికి రిషీ కపూర్ అభ్యంతరం చెప్పాడని సమాచారం. అయినప్పటికీ కెమెర మెన్ వినకపోవడంతో రిషీ కపూర్ చేయి చేసుకున్నట్లుగా తెలిసింది.
తమ చుట్టూవున్న జనాన్ని రిషి, రణదీర్ తోసివేస్తున్నట్టుగా వీడియోలో కనబడింది. తనతో మాట్లాడేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల రణదీర్ దురుసుగా ప్రవర్తించినట్టు వెల్లడైంది. ఇక అభిమానులు, జర్నలిస్టులపై రిషి, రణదీర్ దాడి చేయడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుబట్టారు. ముంబైలోని చెంబర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో ఒకసారి చూడండి..