చైన్నై హ్యాట్రిక్ విజయం..

276
Chennai
- Advertisement -

ఐపిఎల్ 12వ సీజన్ లో చైన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్ధానంలో ఉంది. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్ధాన్ రాయల్స్ పై 8పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రాజస్ధాన్ రాయల్స్ టీం. మొదట బ్యాటింగ్ కు దిగిన చైన్నై నిర్ణిత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది.

కెప్టెన్ ధోని అత్యధిక పరుగులు చేసి మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ధోని 46బంతుల్లో 75పరుగులు చేశాడు. సురేష్ రైనా 32బంతుల్లో 36పరుగులు చేశాడు. 175పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ రాయల్స్ నిర్ణిత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చైన్నై వరుసగా మూడు మ్యాచ్ లలో గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది.

- Advertisement -