చంద్రబోస్‌కు కాళోజి పురస్కారం

491
- Advertisement -

తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే ‘మహాకవి కాళోజి స్మారక పురస్కారం 2016వ సంవత్సరానికిగాను ప్రఖ్యాత సినీ గేయ రచయిత, శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ స్మారక అవారుల గ్రహిత కనుకుంట్ల చంద్రబోన్‌ను ఎంపిక చేసినట్టు టి.వి. రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, దర్శకనిర్మాత నాగబాల సురేష్ కుమార్ తెలియజేశారు. కాళోజి పురస్కారంతో పాటు ప్రశంసాపత్రము, జ్ఞాపిక, శాలువాతోపాటు రూ.10,116/–లు నగదు అందిస్తున్నామని తెలిపారు.

Chandrabose Movies Lyric Writer Kaloji Narayana Rao Writer

గత సంవత్సరం ఈ అవార్డును సినీ గేయ రచయిత డా! సుద్దాల అశోక్ తేజకు అందించామని, 2014లో జె.కె.భారవి ఈ అవారు అందుకున్నారని సురేష్ తెలిపారు. ఈ నెల 14న రవీంద్ర భారతిలో కన్నుల పండువగా జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి, సినీ రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి శ్రీనివాస్, సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి సి.పార్థసారథిలతో పాటు పలువురు సాహితీవేత్తలు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -