గోపి…..ది రియల్ హీరో

467
- Advertisement -

హైదరాబాద్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో జరిగిన ఒలింపిక్ స్టార్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అథ్లెట్లను ఘనంగా సన్మించారు. పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్,దీపా కర్మాకర్,సాక్షి మాలిక్‌లకు సచిన్ కి బీఎండ్యబ్లూ కార్లు బహుమతిగా అందజేశారు.

Gopichnad

సింధు,దీపా,సాక్షిలను చూసి భారత్ గర్వపడుతోందని అన్నారు. ఒలింపిక్స్ మ్యాచ్‌లను ఎంతో ఉత్సుకతతో చూశానని తెలిపాడు.భారత్‌కు మరిన్ని పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఒలింపిక్స్ లో దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించారని రియో విజేతలను ప్రశంసించారు అసమాన పోరాటంతో పతకాలను సాధించారన్నారు. రియోలో రజతపతక విజేత సింధు విజయంలో గోపిచంద్ కృషిని మరవలేమని…గోపీ నిజమైన హీరో అన్నారు సచిన్. మరింత మంది క్రీడాకారులను తయారు చేయాలని ఆశిస్తున్నానన్నారు.ఒలింపిక్ స్టార్లను మనస్ఫూర్తిగా అభినందించారు.రియోలో దీపా కర్మాకర్ పతకం సాధించలేకపోయినా… దేశ ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకున్నారని సచిన్ పేర్కొన్నారు.

sachin

ఒలింపిక్స్‌లోరజత పతకం సాధించిండటంతో తన కల నెలవేరిందని…భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధిస్తానని రజత పతాక విజేత సింధు తెలిపింది. ఒలింపిక్స్‌లో తనకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది దీపా కర్మాకర్‌.ఒలింపిక్స్ లో ముగ్గురు బాగా రాణించారు..భవిష్యత్‌ లో మరిన్ని పతకాలు సాధిస్తారని ఆశీస్తున్నాని గోపిచంద్ తెలిపారు.

sachin-gopi

అంతకముందు ముంబై నుంచి నేరుగా గోపిచంద్ అకాడమీకి చేరుకున్న సచిన్…అథ్లెట్లతో ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు.

- Advertisement -