గణపతికి పాస్‌పోర్ట్‌…

477
Passport for Ganesha
- Advertisement -

మీరు చదివింది.. నిజమే! సాక్షాత్తు వినాయకునికి పాస్‌ పోర్టు ఇచ్చిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. గతంలో రాజస్తాన్ లోని శిఖర్ జిల్లా లో లార్డ్ హనుమాన్ జీ ఫోటో కలిగిన ఆధార్ కార్డు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే.

ఆధార్ కార్డు లో హనుమాన్ దేవుని ఫోటోతో పాటుగా ఆయన పేరు హనుమాన్ జీ అని, ఆయన తండ్రి పేరు పవన్ జీ అని ఉండడంతో పోస్ట్ మ్యాన్ ఖంగుతిన్నాడు. ఇపుడు తాజాగా వినాయకుడికి పాస్‌ పోర్టు అనే ఘటన వెలుగులోకి రావడం సంచలనం అయ్యింది.

IMG_1943

పాస్ పోర్టు పొందడం గగనమవుతున్న ఈ రోజుల్లో లార్డ్‌ గణేశుడికి పాస్ పోర్టు పొందడం ఎంత తేలికో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ పాస్‌ పోర్టు జారీ చేసే అధికారులకు గణేష్‌ కూడా తెలిసినట్లు స్టాంప్ వేశారు. అంతేకాకుండా సెప్టెంబర్‌ 5న ఇండియాకు వస్తున్నట్లు, సంబరాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండని గణేష్ తన పాస్‌ పోర్ట్ వివరాలను పంపించాడు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పేరు గణేష్‌. ఇంటి పేరు దేవ.పాస్‌ పోర్ట్‌ నం. 12345678. ఆయన హిమాలయాల్లో ఉంటాడు. తండ్రి శివ బ్రహ్మదేవా. తల్లి పార్వతీ శివ దేవా.. సిద్ధి, రిద్ధి ఆయన భార్యలు. వారు స్వర్గ నగరిలో ఉంటారు. శుక్ల పక్ష చతుర్థి ఆయన పుట్టిన రోజు.  అయితే ఇది ఎవరైనా తయారు చేశారా.. లేక పాస్ పోర్టు అధికారులు గణేష్‌కి పాస్‌పోర్ట్ జారీ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇపుడు గణేష్‌ పేరు మీదున్న ఈ పాస్‌ పోర్ట్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వినాయకుడికి పాస్ట్ పోర్టు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలకు పాస్ పోర్టు అంటే చుక్కలు చూపించే అధికారులు….దేవుని పేరుతో పాస్ పోర్టు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఇది మన అధికారుల పనితీరుకు నిదర్శనమని సెటైర్లు విసురుతున్నారు.

- Advertisement -