తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కోపం కట్టలు తెంచుకుంది. మైదానంలోనే సహచర ఆటగాడిని దాదాపు కొట్టినంత పని చేశాడు. సహచర క్రికెటర్‌తో గొడవకు దిగి ఏకంగా భౌతిక దాడికే ప్రయత్నించడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్, దిండిగల్ డ్రాగన్స్ జట్ల మ్యాచ్ జరిగింది.
దిండిగల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న అశ్విన్ మైదానంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాటింగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఈ సమయంలో బ్యాటింగ్ చేస్తోన్న తన టీం సభ్యుడు జగదీష్‌ను చెపాక్ బౌలర్ సాయి కిషోర్ ఔట్ చేశాడు. అయితే పెవిలియన్‌కు వెళుతున్న జగదీష్‌ను ఉద్దేశించి సాయి కిషోర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆవేశంతో సదరు బౌలర్‌ను చేతితో నెట్టి వాగ్వివాదానికి దిగాడు అశ్విన్. అయితే అంపైర్లు, సహచర క్రికెటర్లు మధ్యలో కలగజేసుకోవడంతో అశ్విన్ వెనక్కితగ్గాడు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ కెప్టెన్‌గా ఉన్న దిండిగల్ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి చెందింది. భారత జట్టులో సీనియర్ క్రికెటరైన అశ్విన్ ఇలా యువ ఆటగాడితో గొడవకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://youtu.be/eyMnZAmJKvo