‘నువ్వులేక నేను లేను’, ‘తొలిచూపులోనే’ చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వై.కాశీవిశ్వనాధ్ ‘నచ్చావులే’తో ఆర్టిస్టుగా టర్న్ తీసుకుని వరుసగా సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయి అనతి కాలంలోనే వంద సినిమాలను పూర్తిచేశారు. హరీష్ హీరోగా, అవంతిక హీరోయిన్గా ఆర్జె సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత బి.ఎ. రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రంలో కాశీవిశ్వనాధ్ హీరోయిన్ ఫాదర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంతో వంద చిత్రాలను పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా అక్టోబర్ 27న హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో వై.కాశీ విశ్వనాధ్ ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.
దర్శక దేవుళ్లందరికీ నా కృతజ్ఞతలు!!
నటుడు వై.కాశీవిశ్వనాధ్ మాట్లాడుతూ – ”ఇంతవరకు నేను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. అయినా వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ప్రెస్‌మీట్ పెట్టలేదు. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టడానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ‘వైశాఖం’ సినిమాతో నటుడుగా వంద సినిమాలను పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక మ్యాగజైన్ పెట్టినపుడు అది సక్సెస్ అయి క్లిక్ అయితే పాఠక దేవుళ్లకి కృతజ్ఞతలు చెబుతాం. ఒక సినిమా వంద రోజులు ఆడి సూపర్‌హిట్ అయితే దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతారు. అదే ఒక నటుడు వంద సినిమాలు కంప్లీట్ చేస్తే దర్శకులందరికీ కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’, 50వ సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, వందవ సినిమా ‘వైశాఖం’. ఈ జర్నీలో నాకు సహకరించి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రెండు సినిమాలు డైరెక్ట్ చేసి మూడవ సినిమా ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవిబాబు ఇంట్లో నార్మల్ ఫాదర్‌గా ఉన్న నన్ను ‘నచ్చావులే’ చిత్రంలో నేచురల్ ఫాదర్ క్యారెక్టర్ చేయించి నాకు గాడ్‌ఫాదర్ అయ్యారు రవిబాబు. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే రామోజీరావుగారికి, ‘నచ్చావులే’ చిత్రంలో నన్ను ప్రొజెక్ట్ చేసి నాకు సహకరించిన టీం అందరికీ ధన్యవాదాలు. ఈ వంద సినిమాల్లో చిన్న దర్శకులు, పెద్ద దర్శకులు అనే తేడాలేకుండా నాతో సినిమాలు తీసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, కెమెరామెన్స్ అందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కేవలం 6, 7 సంవత్సరాల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగాను. ఇది నేను గొప్పగా చెప్పడం లేదు. స్టేజ్ ఎక్స్పీరియన్స్, బ్యాగ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నటుడుగా వంద సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన నా సహ నటీనటులు, 24 క్రాఫ్ట్స్ ఎంతో మందికి రుణపడి ఉంటాను. డైరెక్టర్స్ నుండి యాక్టర్స్‌గా టర్న్ అయిన వారు వేళ్లమీద ఉన్నారు. వారంతా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్లందరి సరసన నేను కూడా చేరగలిగాను. నన్ను బాగా ఎంకరేజ్ చేసిన దర్శకరత్న డా|| దాసరిగారు, రవిబాబు, శ్రీను వైట్ల, కొరటాల శివ, దశరధ్, శ్రీవాస్, వీరు పోట్ల, పరుచూరి మురళి, గోపీచంద్ మలినేని, జయంత్, బాబీ, ఎంఎస్ రాజు, తేజ, మారుతి, జయగారు, నందినిరెడ్డి, మధుర శ్రీధర్, త్రినాధరావు నక్కిన, సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, చిన్నికృష్ణ, వీరభద్రం, కరుణాకరన్, ఇంకా ఎంతో మంది దర్శకులు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అంతేకాకుండా వారంతా నా ఉన్నత స్ధితికి కారణం అయ్యారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’తో బ్రేక్ వచ్చింది. అక్కడి నుండి 50వ సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వరకు నా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. దశరధ్, దిల్ రాజు ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ ఉంది చేయాలన్నారు. ఆ సినిమా చేశాను. అది హిట్ అయి మరో యాభై సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఒక మంచి పాత్ర వల్ల మరో పది పాత్రల్లో నటించే అవకాశం నటుడికి ఉంటుంది.
నటుడు సక్సెస్ కావాలంటే!!
నటుడు సక్సెస్ కావాలన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా రైటర్స్ మంచి కధలు, మాటలు రాయాలి. అలాగే ఆ పాత్రల్ని దర్శకులు అద్భుతంగా డిజైన్ చేయాలి. అప్పుడే నటుడికి ఎదుగుదల ఉంటుంది. మంచి స్క్రిప్ట్, క్యారెక్టర్, డైరెక్టర్ చేసే సినిమాల్లో అవకాశం వస్తే ఏ నటుడికైనా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎంత మంచి పాత్ర చేశామన్నది ముఖ్యం. ‘నచ్చావులే’లో రవిబాబు మంచి పాత్ర ఇస్తే ‘రైడ్’లో రమేష్‌వర్మ, బెల్లంకొండ సురేష్ గారు డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ధశరధ్, ‘మిర్చి’లో కొరటాల శివ చాలా మంచి పాత్రలు ఇచ్చారు. టైమ్ సెన్స్, డిసిప్లిన్‌తో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ అందరికీ ఫాదర్ క్యారెక్టర్లో నటించాను. ఇంతటి తృప్తికరమైన క్యారెక్టర్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు రూపాన్ని ఇచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు తోడుగా వుండి అనుక్షణం నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా భార్యకు ధన్యవాదాలు.
ఇది నాకు దేవుడిచ్చిన వరం!!
ఒక ఆర్టిస్ట్‌గా ఎదగాలి, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. అది ప్లాన్ చేస్తే జరగదు. నేను డైరెక్టర్‌గా ఎంతో స్ట్రగుల్ అయి రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఇది గాడ్ గిఫ్ట్ అని భావిస్తున్నాను. నా సహ నటీనటులందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆ అదృష్టం లక్కీగా నాకు వచ్చింది. చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు నన్ను డైరెక్ట్ చేయమని చాలామంది అడిగారు. నటుడు కావడం పూర్వజన్మ సుకృతం అది అందరికీ రాదు. నటుడుగా కంటిన్యూ చేయి, డైరెక్షన్ అనేది ఎప్పుడైనా చేయవచ్చు అని బాలయ్యబాబు సజెషన్స్ ఇచ్చారు. అప్పటి నుండి నటనకే నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’, 50వ సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, వందవ సినిమా చేసేటప్పుడు చిన్న యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ‘వైశాఖం’ నా వందవ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. చాలా కూల్‌గా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. డబ్బింగ్ ఫినిష్ అయింది. అవుట్‌పుట్ చూశాను. చాలా బాగా వచ్చింది. వైశాఖంలోనే ఆంజనేయుడు పుట్టిన రోజు, మహా శివరాత్రి పండుగలు వస్తుంటాయి. వాళ్లందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయి. ఎక్కడా వల్గారిటీ లేకుండా చాలా నీట్‌గా ఫీల్‌గుడ్ మూవీలా ‘వైశాఖం’ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి చిత్రంలో నా వందవ సినిమాగా నటించడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.
‘వైశాఖం’లో నా గెటప్, మేనరిజమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి!!
నా ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’లో రామోజీరావు గారు అవకాశం ఇస్తే 50వ సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో దిల్ రాజుగారు అవకాశం కల్పించారు. 100వ సినిమా ‘వైశాఖం’లో బి.ఎ.రాజుగారు ఛాన్స్ ఇచ్చారు. ముగ్గురూ ‘రా’, ‘రా’ అని ఇండస్ట్రీలోకి ఆహ్వానించారు. చాలా ధ్రిల్గా ఫీలవుతున్నాను. 101వ సినిమా మళ్లీ రవిబాబు డైరెక్షన్లో ‘అదిగో’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. సీరియల్స్‌లో చేయని చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో ఇంకా చాలా పాత్రలు చేయాలి. ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి. అందుకని చాలా స్మూత్‌గా సీరియల్స్ చేయనని తిరస్కరించాను. వారందరికీ నా ధాంక్స్. ‘వైశాఖం’లో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హీరోతో ఎక్కువ సీన్స్ ఉంటాయి. నా గెటప్, మేనరిజమ్స్ అన్నీ చాలా కొత్తగా డిజైన్ చేశారు జయగారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఈ సినిమా ఉంటుంది. జయగారు డేరింగ్ డైరెక్టర్. ‘వైశాఖం’ సినిమా కోసం ఒక కొత్త ఎక్విప్మెంట్ కెమెరాని తెప్పించి దానితో సినిమా కంప్లీట్ చేశారు. షూటింగ్ జరిగేటప్పుడే ఫ్లో ఎలా వస్తోంది అని చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది. లైటింగ్, కలరింగ్ బ్యూటిఫుల్‌గా వచ్చింది. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది.
పరిపూర్ణ నటుడుగా పేరుతెచ్చుకోవాలని ఉంది!!
నా దగ్గరకు వచ్చిన అవకాశాల్ని అన్నీ చేశాను. ఇప్పటివరకు ఎవర్నీ క్యారెక్టర్ ఇవ్వమని అడగలేదు. నా మీద నమ్మకంతో గౌరవంతో నాకు మంచి అవకాశాలు రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇంకా నేను చేయాల్సిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. అందరికీ ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయి చేయాలనేది నా కోరిక. కొత్త కొత్త క్యారెక్టర్స్ చేసి పరిపూర్ణ నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఉంది. త్వరలో మరో 100 సినిమాలు కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. డైరెక్షన్ చేయాలని ఉంది. నా మనసుకి నచ్చిన స్క్రిప్ట్, పబ్లిసిటీ, ప్రమోషన్ చేయగలిగే మంచి ప్రొడ్యూసర్ ఉంటే తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. ఒక డైరెక్టర్‌కి ఏం కావాలో క్లియర్‌గా నెరేట్ చేయగలిగితే దానిని యాక్టర్ ఫాలో అయి ఆ క్యారెక్టర్ని ఫీలయి చేయాలి. ఆడియన్స్ కూడా నా పర్ఫామెన్స్, నా బాడీలాంగ్వేజ్ నచ్చి నటుడుగా యాక్సెప్ట్ చేశారు. కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’లో బాగా చేశావని అప్రీషియేట్ చేశారు. అది ఎప్పటికీ మరిచిపోలేను.
కష్టపడితే ఏదైనా సాధించవచ్చు!!
కృష్ణ, శ్రీదేవి జంటగా మిద్దే రామారావుగారి డైరెక్షన్లో వచ్చిన ‘పచ్చని కాపురం’ చిత్రానికి అసోసియేట్‌గా వర్క్ చేశాను. అప్పుడే బి.ఎ. రాజుగారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన కృష్ణగారికి రైట్ హ్యాండ్‌లా ఉండేవారు. అప్పటి నుంచి బి.ఎ. రాజుగారు, నేను చాలా క్లోజ్ అయ్యాం. జర్నలిస్టుగా వెయ్యి సినిమాల పిఆర్ఓగా ఎంతో ఎత్తుకి ఎదిగారు రాజుగారు. నిర్మాతగా ఆయన చేతుల మీదుగా చెక్ తీసుకునే స్ధాయికి నేను ఎదిగాను. ఇవన్నీ చూస్తుంటే చాలా ధ్రిల్లింగ్‌గా ఉంది. కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా, ఏదైనా సాధించవచ్చు అనడానికి బి.ఎ.రాజుగారే నిదర్శనం.
‘వైశాఖం’ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాను!!
డిక్టేటర్ 98, ‘సర్ధార్ గబ్బర్‌సింగ్’ 99వ సినిమా. వందవ సినిమా ఏం చేయాలి అనుకునే టైమ్‌లో బి.ఎ. రాజుగారు ‘వైశాఖం’ కధ వినండి అని ఫోన్‌చేసి చెప్పారు. కధ విని చాలా ఎగ్జైట్ అయ్యాను. అంత అద్భుతంగా అనిపించింది. ‘లవ్లీ’లో గెస్ట్ క్యారెక్టర్లో నటించాను. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. ఇలాంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించిన దర్శక దేవుళ్ళు అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు అన్నారు.
కాశీ విశ్వనాధ్ నటించిన చిత్రం, దర్శకుని వివరాలు.
1. నచ్చావులే – రవిబాబు, 2. రైడ్ – రమేష్‌వర్మ, 3. బిందాస్ – వీరు పోట్ల, 4. నమోవెంకటేశ – శ్రీను వైట్ల, 5. పరమవీరచక్ర – దాసరి నారాయణ రావు, 6. అధినాయకుడు – మురళి, 7. లయన్ – సత్యదేవ్, 8. డాన్‌శ్రీను – మలినేని గోపి, 9. పోటుగాడు – పవన్ వడయార్, 10. పార్క్ – వి.ఎన్. ఆదిత్య, 11. ముగ్గురు – విఎన్ ఆదిత్య, 12. భీమవరం బుల్లోడు – ఉదయ్, 13. జెమ్ – జొన్నలగడ్డ శ్రీనివాస్, 14. తూనీగ తూనీగ – ఎంఎస్ రాజు, 15. ప్రియుడు – శ్రవణ్, 16. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి – కన్మణి, విఎన్ ఆదిత్య, 17. గ్రీకువీరుడు – దశరధ్, 18. పిల్లా నువ్వులేని జీవితం – రవికుమార్ చౌదరి, 19. తీన్మార్ – జయంత్ సి పరాన్జీ, 20. డైనమిక్ – కీర్తి, 21. లోకమే కొత్తగా – భరత్, 22. తొలిసారిగా – మహేష్, 23. లవ్లీ – జయ బి., 24. వెయ్యి అబద్ధాలు – తేజ, 25. యుగళగీతం – శివాజీ, 26. మౌనరాగం – ఎల్.సురేష్, 27. ఇష్క్ – విక్రంకుమార్, 28. అమరావతి – రవిబాబు, 29. లడ్డూబాబు – రవిబాబు, 30. కందిరీగ – సంతోష్ శ్రీన్వాస్, 31. ఈవర్షం సాక్షిగా – రమణ, 32. గాల్లో తేలినట్టుందే – సురేష్, 33. జబర్దస్త్ – నందినిరెడ్డి, 34. అది నువ్వే – నీలం ప్రసాద్, 35. పెళ్లి పుస్తకం – రామకృష్ణ, 36. నేనేం చిన్నపిల్లనా – సునీల్‌కుమార్‌రెడ్డి, 37. భాయ్ – వీరభద్రం చౌదరి, 38. అలా ఎలా – అనీష్, 39. ఎందుకంటే ప్రేమంట – కరుణాకరన్, 40. డిస్కో – హరికృష్ణ, 41. కళావర్ కింగ్ – సురేష్, 42. మిర్చి – కొరటాల శివ, 43. పాండవులు పాండవులు తుమ్మెద – శ్రీవాస్, 44. స్టూడెంట్ లీడర్ – అప్పారావు, 45. దిల్లున్నోడు – జై రవీంద్ర, 46. ఎంతందంగా ఉన్నావే – మహేంద్ర, 47. రఫ్ – సుబ్బారెడ్డి, 48. నువ్వా నేనా – నారాయణ, 49. కొత్తజంట – మారుతి, 50. మిస్టర్ పర్ఫెక్ట్ – దశరధ్, 51. బ్రోకర్ – ఆర్పీ పట్నాయక్, 52. ఇట్స్ మై లవ్‌స్టోరీ – మధుర శ్రీధర్, 53. ఇట్స్ మై లైఫ్ – ఆర్.నేతాజీ, 54. ఆకాశంలో సగం – ప్రేమరాజ్, 55. జస్ట్ గణేష్- శరవణన్, 56. అసలేం జరిగిందంటే – ప్రభాకర్, 57. మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో – హృదయరాజ్, 58. తీయని కలవో – శివాజీ, 59. ప్యార్‌మే పడిపోయానే – రవి చావలి, 60. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి – చిన్నికృష్ణ, 61. జోరు – కుమార్ నాగేంద్ర, 62. తుంటరి – కుమార్ నాగేంద్ర, 63. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ – శ్రీను కోనేటి, 64. ఈ పెద్దోళ్లున్నారే – లక్ష్మణ్, 65. జగన్ నిర్దోషి – వెంకన్నబాబు, 66. త్రీ ఇడియట్స్ – మహేష్, 67. రారా కృష్ణయ్య – మహేష్, 68. మేం వయసుకు వచ్చాం – త్రినాధరావు నక్కిన, 69. సాహెబా సుబ్రహ్మణ్యం – శశికిరణ్, 70. గోవిందుడు అందరివాడేలే – కృష్ణవంశీ, 71. దృశ్యం – శ్రీప్రియ, 72. పవర్ – బాబీ, 73. పవనిజం – ఇ.కె. చైతన్య, 74. కిరాక్ లవ్‌స్టోరీ – హారిక్, 75. లౌక్యం – శ్రీవాస్, 76. లక్ష్మిరావే మా ఇంటికి – నంద్యాల రవి, 77. లవకుశ – విజయ్, 78. పడ్డామండీ ప్రేమలో మరి – మహేష్, 79. ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ – చందు, 80. పటాస్ – అనిల్ రావిపూడి, 81. చూడాలని చెప్పాలని – సురేష్, 82. శ్రీరామరక్ష – శ్రీరాం, 83. ఎర్రబస్సు – దాసరి నారాయణరావు, 84. రెడ్ ఎలర్ట్ – చంద్రమహేష్, 85. రాజా మీరు కేక – కిషోర్, 86. టైగర్ – టి.వి.ఆనంద్, 87. జాదుగాడు – యోగి, 88. గోదారి నవ్వింది – భీంజీ, 89. కన్నయ్య – విద్య, 90. ప్రేమంటే సులువుకాదురా – గోవింద్, 91. సాయిరాం శంకర్ – సుదర్శన్ మూవీ, 92. భలే భలే మగాడివోయ్ – మారుతి, 93. మసాకలి – నభీ, 94. కారం దోస – త్రివిక్రమ్, 95. రన్ – అనిల్‌కృష్ణ, 96. మా అబ్బాయి – కుమార్, 97. మాయామాల్ – గోవింద్, 98. డిక్టేటర్ – శ్రీవాస్, 99. సర్ధార్ గబ్బర్‌సింగ్ – బాబీ, 100. వైశాఖం – బి.జయ, 101. అదుగో – రవిబాబు.