ఐటీలో గోవాకు సహకారం అందిస్తాం : కేటీఆర్‌

517
KTR
KTR
- Advertisement -

తెలంగాణ, గోవా రాష్ట్రాల మద్య సంబంధాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ఉదాత్తమైన ప్రక్రియకు తెరలేపింది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల మద్య సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు సాగునీటితోపాటు పలు రంగాల్లో చర్చలు, సహకారం ద్వారా ముందుకు వెలుతున్న ప్రభుత్వం మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నది.

ఇప్పటికే ఇతర రాష్ర్టాలతో పోటీ పడుతూ ఐటి రంగంలో అగ్రపథానికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ర్టం, తాజాగా ఐటి రంగ అభివృద్ది కోసం గోవా రాష్ర్టానికి సహకారం అందించే దిశగా ఒక ఒప్పందం చేసుకోనున్నది. ఈ ఒప్పందం చేసుకునేందుకు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు,గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మి కాంత్ పర్సెకర్ తో గోవాలో ఈ రోజు సాయంత్రం సమావేశం అయ్యారు.

Ktr telangana it minister
Ktr telangana it minister

ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రభుత్వం, గోవా రాష్ర్టానికి పలు అంశాల్లో సహకరించేందుకు ముందుకు వచ్చింది.

ఐటి రంగంలో తెలంగాణ చేపట్టిన టి హబ్, టాస్క్ వంటి వినూత్న కార్యక్రమాలను పరిశీలించిన తర్వతా గోవా ప్రభుత్వం, తమ రాష్ర్టంలోనూ ఐటి పరిశ్రమ అభివృద్ది, స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ సహకారం కోరింది.

తెలంగాణ ప్రభుత్వంతో గోవా చేసుకునే ఈ ఒప్పందం ద్వారా ఐటి పరిశ్రమ అభివృద్దికి రూపొందించాల్సిన ప్రభుత్వ పాలసీల తయారీలో తెలంగాణ ఐటి శాఖ సహకరిస్తుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు.
తాము ఇప్పటికే ఒవరాల్ ఐటి పాలసీ ప్రేమ్ వర్క్ తోపాటు, అనుబంద పాలసీలను విడుదల చేసిన ఏకైన రాష్ర్టంగా తెలంగాణ నిలిచిందన్నారు.  ఈ పాలసీలకు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, గోవా రాష్ర్టంతో తమ అనుభవాన్ని పంచుకోనున్నట్లు తెలిపారు.
రాష్ర్టాల మద్య పోటీతత్వం కాదని, సమన్వయం కావాలని తాము నమ్ముతామన్నారు. ఒక రాష్ర్టానికి, మరో రాష్ర్టం తమ అదర్శ వంతమైన ప్రభుత్వ విధానాలను, అనుభవాలను పంచుకున్నప్పుడే దేశం అభివృద్ది చెందుతుందన్న విశాల భావన అధారంగా తాము పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ ఓప్పందం ద్వారా అసలైన సమాఖ్య స్పూర్తిని చాటాలన్నదే తమ అభిమతమని, రాష్ర్టాల మద్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే ఇండియా మరింత ముందుకు పొతుందన్నది తమ నమ్మకమని మంత్రి కెటిఆర్ తెలిపారు.

తెలంగాణ రెండు సంవత్సరాల వ్యవధిలోనే అనేక అత్యుత్తమ పాలసీలను రూపొందించిందని గోవా ముఖ్యమంత్రి అభినందించారు. ముఖ్యంగా ఐటి పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీల తయారీ అనుభవాన్ని తాము పంచుకోనున్నట్లు తెలిపారు. ఐటి, ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ, గోవా పరస్పర సహకారానికి ఈ ఒప్పందం సహకరిస్తుందన్నారు.

ఈ ఓప్పందం ద్వారా తెలంగాణలో చేపట్టిన పలు కార్యక్రమాల స్పూర్తితో గోవా రాష్ర్టానికి సహకారం అందించనున్నారు. ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగంలో టి హబ్ ఏర్పాటుతో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, గోవాలోను ఒక టి హబ్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయనున్నది.
గోవాకి వచ్చే స్టార్ట్ అప్స్ చాలవరకు ఇంక్యూబేషన్ స్ధాయిలో ఉన్న నేపథ్యంలో,వాటికి టి హబ్ సహకారంతో వాటిని స్కెల్ అప్ చేసే అవకాశం కలుగుతుంది.
ఈ ఒప్పదం ద్వారా ఇంక్యూబేట్ ఇన్ గోవా, ఇన్ కార్పెట్ ఇన్ తెలంగాణ ( గోవా స్టార్ట్ అప్స్ పరిశ్రమల స్ధాయికి చేర్చేలా) అనేలా టిహబ్ సహకారం అందించనున్నది.
ఇక గోవాలో ఐటి పరిశ్రమ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించనున్నది. పాలసీ పరంగా తాము తీసుకున్న పలు అదర్శవంతమైన విధానాలను గోవాకు తెలుపనున్నది.
దీంతోపాటు టాస్క్ వంటి సంస్ధ ఏర్పాటు ద్వారా, గోవాలో శిక్షణ, నిపుణుల తయారీ వంటి రంగాల్లో సహకారం అందించనున్నారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గోన్నారు.

- Advertisement -