ఎన్టీఆర్ కు బ్లాంక్ చెక్

608
janatha-garage-day-
janatha-garage-day-
- Advertisement -

జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ సాధించింది. అది ఓ కొత్త చ‌రిత్ర సృష్టించింది. టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ హిట్స్‌ లో ఒక‌టిగా నిలిచింది ఈ చిత్రం. దాదాపు పుష్క‌ర‌కాలం త‌ర్వాత తార‌క్‌ కి బిగ్ హిట్ లేని కొర‌త‌ను తీర్చింది. ఇండ‌స్ట్రీ హిట్‌ను అందించింది యంగ్‌టైగ‌ర్‌కి జ‌న‌తా గ్యారేజ్‌. ఈ సినిమా అంచ‌నాల‌కు మించి లాభాల‌ను తెచ్చిపెట్టింది. చాలా చోట్ల నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది ఈ మూవీ. ఇక‌, బాహుబ‌లి త‌ర్వాత టాలీవుడ్‌లో అతిపెద్ద స‌క్సెస్‌గా నిలిచిన శ్రీమంతుడుకి, జ‌న‌తాకి మ‌ధ్య క‌లెక్ష‌న్ల విషయంలో గ్యాప్ 2-3 కోట్లు కూడా లేదు.

junior-ntr-janatha-garage-

ఎన్టీఆర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్నాడు. అతడు ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేయడమే ఆలస్యం.. ఎంతైనా సమర్పించుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఇదే దారిలో ఉన్నారు. తారక్ తో మరో సినిమా చేస్తామంటున్న మైత్రీ మూవీస్ నిర్మాతలు…. ఈసారి ఎన్టీఆర్ కు బ్లాక్ చెక్ ఇస్తామని అంటున్నారు.

 -NTR-missed-Janatha-Garage-Release-Date-August-12th

జనతా గ్యారేజ్ ఊహించని విజయం సాధించింది. శ్రీమంతుడుకు జస్ట్ 2-3కోట్ల రూపాయల దూరంలో ఆగిపోయింది. చాలా సెంటర్లలో బహుబలి రికార్డుల్ని కూడా క్రాస్ చేసింది. సినిమాకు ఇప్పటివరకు దాదాపు 82 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దీంతో నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చాయి. అలా వచ్చిన లాభాల్ని సినిమా యూనిట్ సభ్యులకు పంచుతున్నారు నిర్మాతలు. ప్రతి డిపార్ట్ మెంట్ కు 10లక్షలు చొప్పున ఇస్తున్నారు. ఇందులో భాగంగా కొరటాలకు కూడా మరోసారి భారీగా ఎమౌంట్ దక్కినట్టు సమాచారం.

 NTR-Koratala-Janatha-Garage

అయితే, తార‌క్‌కి మాత్రం పైసా కూడా ఇవ్వ‌డం లేద‌ని అంటున్నార‌ట‌. ఈ సినిమా కోసం తార‌క్ మంచి గ్రౌండ్ వ‌ర్క్ చేశార‌ని, సినిమా స‌క్సెస్‌లో కీ రోల్ ఆయ‌న‌దే అని చెబుతున్నారు జ‌న‌తా నిర్మాత‌లు. అంతేకాదు, త‌మ‌కు తార‌క్ మాటిచ్చాడ‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో మ‌రో సినిమా చేస్తామ‌ని, అప్పుడు బ్లాంక్ చెక్ ఇస్తామ‌ని అన్నార‌ట. మొత్త‌మ్మీద‌, త‌న‌కు హిట్ రావ‌డం ఓ హ్యాపీ అయితే, త‌న సినిమా టీమ్ మెంబ‌ర్స్‌కి నిర్మాత‌లు ఇలా లాభాలు పంచిపెట్ట‌డం మ‌రో ఆనందమ‌ని.. ఇలా త‌న‌కు డ‌బుల్ హ్యాపీ ద‌క్కింద‌ని తార‌క్ ఖుషీ ఖుషీగా ఉన్నాడ‌ట‌.

- Advertisement -