యూజర్లకు షాకిచ్చింది ట్విట్టర్. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు ఎలన్ మస్క్.అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్‌కు చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు, త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు.
ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రదిపాదనలో ఉందని…అయితే, ఎంత ఫీజు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అలాగే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు కల్పిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు.
ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది. ఇక ఖాతాదారులందరి నుంచి సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తే ట్విట్టర్ కాస్తా పెయిడ్ ప్లాట్ ఫామ్‌గా మారుతుంది. మరోవైపు, ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికలో 550 మిలియన్లకు పైగా నెలవారీ యూజర్లుఉన్నట్లు మస్క్ తెలిపారు. వీరు ఒక రోజులో కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు పెడుతున్నారని వివరించారు.
Also Read:మహిళా బిల్లుతో వచ్చే మార్పేంటి?