ఆ హీరోకు వెయ్యికోట్ల రెమ్యునరేషన్..

580
- Advertisement -

బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌.. అంటూ పెద్దోళ్ళ దగ్గర్నుంచి చిన్న పిల్లల వరకు ఓ ఊత పదంలా వాడుతున్నారంటే జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు ప్రేక్షకుల మనసులపై ఎంతటి బలమైన ముద్రని వేశాయో వేరే చెప్పక్కల్లేదు. స్టయిలీష్‌ బాండ్‌ క్యారెక్టర్‌, కళ్ళు చెదిరే లొకేషన్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. వంటి తదితర ప్రత్యేకతలతో విజువల్‌ వండర్స్‌గా బాండ్‌ సిరీస్‌ చిత్రాలు నిలిచాయి. ఈ ప్రాంచైజీ సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ సిరీస్ లో వచ్చే సినిమాలు దేనికదే ప్రత్యేకంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి సినిమాల్లో అవకాశం దక్కడమే అదృష్టంగా భావిస్తారు చాలా మంది స్టార్స్.

hollywood-james-bond-movie-skyfall

అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చినా, వందల కోట్లు పారితోషికంగా ఇస్తానన్నా రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడు హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్. గత నాలుగు జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలైన కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్రైఫాల్, స్పెక్టర్ చిత్రాల్లో డేనియల్ క్రేగ్ హీరోగా నటించాడు. స్పెక్టర్ తర్వాత తాను జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాల్లో నటించబోనని డేనియన్ క్రేగ్ ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా’ అంటూ ఆ మధ్య సంచలన వ్యాఖ్య చేశాడు కూడా…

Daniel-Craig-in-Skyfall-Atop-Train

ఈ నేపధ్యంలోనే క్రెయిగ్ ను మరో రెండు బాండ్ చిత్రాల్లో నటించమని సోనీ సంస్థ ముందెన్నడూ ఎవరికి ఇవ్వనంత భారీ పారితోషకాన్ని ఇస్తామని ఆఫర్ చేసింది.జేమ్స్‌ బాండ్‌గా కేవలం రెండు సినిమాల్లో నటిస్తే చాలు ఏకంగా 150 మిలియన్‌ డాలర్లు (రూ. 996 కోట్లు) ఇస్తామని ఆ హీరో కి నిర్మాతలు ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

Daniel Craig - New James Bond movie Casino Royale

ఇప్పటికిప్పుడు బాండ్‌ పాత్రలో కొత్త వ్యక్తిని తీసుకోవడం సోనీకి ఇష్టం లేదని, తదుపరి రెండు సినిమాలకూ బాండ్‌గా క్రెయిగ్‌ ఉంటేనే బాగుంటుందని ఆయనను మరోసారి 007గా చూపించేందుకు సోనీ, బాండ్‌ రూపకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి బాండ్‌గా మరోసారి క్రెయిగ్‌ తెరపై కనిపిస్తాడా? లేదా? అన్నది చూడాలి.

- Advertisement -