త్వరలో ముహూర్తం పెడతా…

220
Nagarjuna Confirmed Both of His Son's Marriage Proposal
Nagarjuna Confirmed Both of His Son's Marriage Proposal
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. నాగార్జున తన ఇద్దరు తనయులు, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ ల వివాహంపై మరోసారి స్పందించారు.
అక్కినేని నాగార్జున ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నారు. ఒకవైపు తను హథీరాం బాబాగా నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ షూటింగ్ శరవేగంగా పూర్తి అయిపోతుండడం.. మరోవైపు ఇద్దరు తనయుల కొత్త సినిమాలపై ప్రకటన చేయడంతో ఆయనలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

 

ఓం నమో వెంకటేశాయ షూటింగ్ అప్ డేట్స్ చెప్పడం నాగ్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు సంగతులను పంచుకున్న నాగార్జున.. తనయుల ఇద్దరి పెళ్లిపై కూడా మాట్లాడారు. నాగ చైతన్య.. అఖిల్ లు తమ జీవిత భాగస్వాములను తామే ఎంచుకోవడం సంతోషమే అన్న నాగ్.. వారి పెళ్లికి సంబంధించిన డీటైల్స్ ను అనౌన్స్ చేసేందుకు ప్రత్యేకంగా మరో ప్రెస్ మీట్ పెడతానని చెప్పడం విశేషం.

తన కుటుంబంలో రెండు పెళ్లిళ్లు ఉంటాయంటూ చెప్పారు. అక్టోబర్‌లో నాగచైతన్య-కల్యాణ్‌కృష్ణ.. అఖిల్‌-విక్రమ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో చిత్రాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తనకు ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రమంటే చాలా ఇష్టమని, అలాంటి స్క్రిప్ట్‌నే కల్యాణ్‌కృష్ణ తయారు చేశారని, చైతన్య ఆ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్యాణ్‌కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.
అక్టోబర్‌ చివరినాటికి ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని.. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక ‘సోగ్గాడే-2 బంగార్రాజు’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని నాగార్జున స్పష్టం చేశారు.

- Advertisement -