అబ్బాస్‌కు ఏమైంది!

106
Abbas
- Advertisement -

ప్రేమదేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు అబ్బాస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించగా దీంతో అబ్బాస్‌కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమాల్లో నటించి మెప్పించారు. 2015లో చివరగా ఓ మలయాళ సినిమా చేసి వెండితెర నుండి తప్పుకున్ఆరు.

అయితే తాజాగా ఓ సర్జరీ చేయించుకుని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫొటోను తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళన పడ్డాను. కొంచెం భయం కూడా వేసింది. నా భయాలని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాను అని తెలిపారు.

నా మనస్సును ధృడంగా ఉంచుకోవడానికి చాలా ట్రై చేశాను. నాకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరగా ఇంటికి రావాలి అనుకుంటున్నాను. మీ ప్రేమ, ప్రార్థనలు నాకు సపోర్ట్ గా ఉన్నాయి అంటూ తెలిపారు. అయితే ఏ సర్జరీ జరిగిందో చెప్పలేదు. దీంతో అబ్బాస్‌కు ఏమైంది అని నెటిజన్లు ఆరా తీస్తుండగా మరికొంతమంది త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -