మొన్నటిదాకా ఆయన సక్సెస్ఫుల్ దర్శకుడు. మహేష్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి బడా హీరోలు సైతం ఆయన వెంట పడ్డారు. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన రెండు ఫ్లాప్‌లు ఆయన ఇమేజ్‌ని మసకబారేలా చేశాయి.
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్లకు కొంత కాలంగా అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. సినిమాలు పోవడం కామనే కానీ.. వైట్లకు మరీ పర్సనల్ గానూ గొడవలు పెరుగుతున్నాయి. కోన వెంకట్ తో మొదలైన ఈ పర్సనల్ టార్చర్ ఇప్పుడు ఏకంగా శ్రీను వైట్ల ‘ఇల్లు అమ్ముకునేం’తగా పెరిగిపోయాయంటున్నారు. కోన తర్వాత ప్రకాష్ రాజ్ తో గొడవలు వచ్చినప్పుడు చాలామంది వైట్లదే తప్పన్నారు.
మరోవైపు ఆగడు నుంచి అట్టర్ ఫ్లాపులే వస్తుండటం.. అది కూడా ఆ క్యాంప్ నుంచి కోన వెంకట్, గోపీ మోహన్ బయటకు వెళ్లిన తర్వాతే కావడంతో శ్రీనుది సొంత టాలెంట్ కాదు అనేవారు పెరిగిపోయారు. అందుకు కొనసాగింపుగా బ్రూస్ లీ డిజాస్టర్ ఈ మాజీ స్టార్ డైరెక్టర్ ను మరింత కుంగదీస్తే..ఆ వెంటనే భార్య పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. తర్వాత ఎలాగోలా ఆ కేస్ ను విత్ డ్రా చేయించుకున్న శ్రీను వైట్లకు సంబంధించి మరో లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్ అతను తన ఇంటిని అమ్మకానికి పెట్టాడనే..జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన ఇంటిని శ్రీను వైట్ల అమ్మకానికి పెట్టాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అప్పులవడంతోనే ఇలా డిసైడ్ అయ్యాడట. అయితే, కొందరు మాత్రం ఇది అబద్దం అంటున్నారు. వాస్తు రీత్యా అమ్ముతున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటి వాస్తు బాగాలేదని, మళ్లీ మెరుగైన అవకాశాలు, విజయాలు రావాలంటే ఇంటిని అమ్మేయాలని తమ ఇంటి బ్రాహ్మణ పండితుడు చెప్పాడట. అందుకే ఇంటిని రూ.15 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడట. అయితే.. ఇంటిని కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదని సమాచారం.