సింగ‌ర్ సునీత‌ షాకింగ్ డెసిష‌న్‌?

194
Singer Sunitha's debut with Shortfilm
Singer Sunitha's debut with Shortfilm
- Advertisement -

అందాల గాయని సునీత ఓ షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా ఛాన్సులు వెంటపడినా… వాటిని కాదనుకుని మరీ ఈ లఘుచిత్రం చేస్తుండటం విశేషం.
టాలీవుడ్లో ఎందరు గాయనీమణులున్నా సునీత చాలా స్పెషల్. స్టేజ్ పై వ్యాఖ్యాతగా వ్వవహరించినా… మైక్ పట్టి గాన కోకిలగా ఆలాపించినా ఆ వేదికకే అందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే ఆమెకు యూత్లో అంత ఫాలోయింగ్. ఏ గాయనికి లేనంతమంది అభిమానులు తనకు ఉన్నారు. ఆమె ఫాలోయింగ్ చూసి చాలా మంది దర్శక, నిర్మాతలు సినిమాల్లో అవకాశాలిచ్చారు. కానీ వాటిని సునీత సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఆ అభిమానలందరకీ పెద్ద షాక్ ఇవ్వనున్నారు.

 

రెండు రోజుల క్రితమే అందాల సింగర్ సునీత్ ఓ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుందని ఓ వార్త వచ్చింది. కానీ ఆ వార్తలో నిజమెంత? సినిమా ఛాన్సులు కాదని ఆ లఘు చిత్రంతో నటించడానికి కారణం ఏంటి? అందులో ఆమె క్యారెక్టర్ ఏంటి? వంటి చాలా ప్రశ్నలు సునీత అభిమానులకు కలిగాయి. అయితే వీటిన్నింటిపై సునీత్ ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసింది.

అవును… మీరనుకుంటుంది నిజమే. `రాగం` అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తున్నా. సందేశాత్మక కథతో తెరకెక్కుతోంది. అందుకే ఒకే చెప్పా. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అది. ‘అసలు నేను యాక్టింగ్ కి సరిపోనని నా ఉద్దేశ్యం. అందుకే సినిమాల్లో పలు ఆఫర్స్ వచ్చినా ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ రాగం ఫిలింలో ఎవరిపైనా ఆధారపడని మహిళ పాత్ర పోషిస్తున్నా. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయినా.. పాడడం అంటే ఆ పాత్రకు చాలా ఇష్టం. వర్క్ ప్లేస్ లలో ప్రతీ రోజు మహిళలు ఎదుర్కునే ఎన్నో సమస్యలను ఇది డీల్ చేస్తుంది. ఎంతో మందికి ఆలోచనలకు రేకెత్తించే కాన్సెప్ట్ ఇది’ అన్న సునీత.. ఈ మూవీకి ఎక్కువ మంది మహిళలే పని చేయడాన్ని గుర్తు చేసింది. ముఖ్యంగా చైతన్యకు అవకాశం ఇవ్వడంలో తన ఉద్దేశ్యం కూడా ప్రోత్సహించడమే అని చెప్పింది సునీత.
చైతన్య శ్రీ పెరంబదూర్ పేరు చూసీ మేల్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ ఫీమేల్ డైరెక్టర్ తను. బాగా డైరెక్ట్ చేస్తున్నారు. చక్కని సహనటుల సాన్నిధ్యంలో కొత్త పనిని బాగా ఎంజాయ్ చేస్తున్నా. నా అభిమానుల్లాగే నేను కూడా ఎప్పుడూ యూట్యూబ్ లోకి రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాని సునీత ట్వీటారు. అలాగే మేకప్ వేసుకుంటున్న పిక్ ను కూడా పోస్ట్ చేశారు.

 

- Advertisement -