ఇలా రాయడం సరైంది కాదు..

178
​Taapsee Pannu

ఓ ఆంగ్ల పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటి తాప్సి. బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖితో కలిసి తాను నటించడంలేదంటూ తాప్సి చెప్పినట్లూ ఓ పత్రిక వార్తను ప్రచురించింది. దీనిపై స్సందించిన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లు రాయడం బాగులేదని తాప్సి మండిపడ్డారు.

Taapsee Pannu

ఇతరుల గురించి రాసేముందు నిజనిజాలు తెలుసుకుని రాయాలన్నారు. ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఇలా రాయడమనేది సరైంది కాదని ఆమె అన్నారు. ఓ వార్త పత్రిక రాసిన ఆ న్యూస్‌ను ఫోటో తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై ఆ వార్తను రాసిన రిపొర్టర్ స్పందించాడు. దీని గురించి అస్సలు నాకేం తెలియదని.. ఇందుకు కారణం తన పీఆర్‌ బృందమేనని తెలిపారు.

ఆయన స్పందించిన తీరుపై తాప్సీ మండిపడుతూ..ముందుముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఘాటుగా హెచ్చరించారు. ఇటీవల నటి, యాంకర్ రష్మీ విషయంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆమె వస్తున్నారన్న ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రష్మీ కూడా స్పందించారు. ఇక తాప్సి ప్రస్తుతం హిందిలో ‘ముల్క్‌, ‘మన్మర్జియా’ చిత్రాల్లో నటిస్తూ తెలుగులో ఆదికి జోడీగా ‘నీవెవరో’ సినిమాలో నటిస్తోంది.