సెహ్వాగ్‌ డిజైన్ చేసిన కొత్త 200 నోటు..అందులో కోహ్లీ

242
sehwag
- Advertisement -

అసాధారణ ఆట తీరుతో మంచి ఫామ్ లో ఉన్న స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ..ముంబైలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కూడా రెచ్చిపోయాడు. డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో కోహ్లీ పై ప్రముఖ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెతున్నాయి. విరాట్ కోహ్లీ వీరవిజృంభణ చూసి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఏడాదిలో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోహ్లీని ఆయన అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు…కోహ్లీ ట్రిపుల్ డబుల్ సెంచరీ నేపథ్యంలో తన ట్వీట్టర్ ద్వారా ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. కొత్త రూ.200 నోట్లు ముద్రించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆయన ఓ ప్రతిపాదన చేశారు. ఆ నోటుపై కోహ్లీ డబుల్ సెంచరీ అనంతరం సంతోషంతో బ్యాటు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంది.

sehwag

సెహ్వాగ్ ప్రతిపాదిత కరెన్సీ నోట్‌ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కోహ్లీ ఆటతీరును సెహ్వాగ్ మాత్రమే కాదు…శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ సైతం ప్రశంసలతో ముంచెంతారు. ‘ది జీనియస్ ఈజ్ ఎట్ వర్క్’ అంటూ ట్వీచ్ చేశారు. కోహ్లీ బ్యాటింగ్ తీరు చూసితీరాల్సిందేనని ప్రశంసించారు. సెహ్వాగ్ పోస్ట్ తో కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దే లేదు. తమ అభిమాన ఆటగాడు ఇలా వరుస సెంచరీలతో దూసుకుపోతుండడంతో హార్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కోహ్లీ తన ఆటతో దిగ్గజాల సరసన చేరిపోయాడు.

sehwag

- Advertisement -