శ్రీవారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ..

30

టాలీవుడ్‌ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ రోజు తిరుమ‌ల‌లో దేవస్థానాన్ని సందర్శించారు. ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నరు. ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దగ్గరుండి విజ‌య్‌కి వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. విజ‌య్ దేవ‌రకొండ వెంట ఆయ‌న త‌ల్లి, తండ్రి, సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఉన్నారు.

ఆ తర్వాత స్వామి వారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వారిని శాలువాలతో సత్కరించారు. కాగా ప్రస్తుతం విజయ్ పూరి జగనాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, పూరి – ఛార్మి – కరణ్ జోహార్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి విడుదల చేయ‌నున్నారు.