పెళ్లిపై అధికారిక ప్రకటన చేసిన రకుల్‌..

18

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శుభవార్త చెప్పింది. తన పుట్టినరోజు నాడే పెళ్లిపై అధికారిక ప్రకటన చేసింది. కొన్నాళ్లుగా తనపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ తన లవర్ పేరును ప్రకటించింది.. అంతేకాదు ఇకపై అతనితో కలిసికట్టుగా జీవితాన్ని సాగించబోతున్నట్లు చెప్పేసింది. ఇన్నాళ్లు ఈ అమ్మ‌డు సీక్రెట్ ప్రేమ వ్యవ‌హారం న‌డిపి ఎట్ట‌కేల‌కు దానిపై ఓపెన్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న విష‌యాన్ని తెలియ‌జేసింది. బాలీవుడ్ యువ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రిలేషన్‌లో ఉన్నట్లు రకుల్ ప్రీత్ తెలిపింది.

థాంక్యూ మై లవ్.. ఈ ఏడాది నాకు దొరికిన అతి పెద్ద‌గిఫ్ట్ నువ్వు. నా జీవితాన్ని రంగుల‌మ‌యం చేశావు. ఎప్పుడు న‌వ్విస్తూనే ఉంటావు. ఇలా ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో మధర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం అంటూ హార్ట్‌ ఎమోజీలతో తన ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చింది. ఈ రోజు రకుల్ 31వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు రకుల్ ప్రీత్‌కు తోటి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రీసెంట్‌గా కొండ పొలం సినిమాతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించింది ర‌కుల్ ప్రీత్ సింగ్.