బేటీ బచావో…అంబాసిడర్‌గా సాక్షి

211

ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌కు హర్యానా ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అభిమానులు, నేతలు జాతీయ జెండాలు, ఫ్లవర్ బొకేలతో ఎయిర్ పోర్టుకు వెళ్లి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఎయిర్ పోర్ట్ దగ్గర కళాకారులు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. బహదూర్ ఘర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సాక్షిని సన్మానించారు. సాక్షి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 2.50 కోట్ల నజరానాను అందజేశారు.

sakshi 1

బేటీ బచావో.. బేటీ పడావో.. కార్యక్రమానికి సాక్షిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. సాక్షి స్వగ్రామంలో స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షి మున్ముందు ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని సీఎం ఖట్టర్ ఆకాంక్షించారు.అంతకు ముందు మాట్లాడిన సాక్షి.. రాష్ట్ర ప్రభుత్వం తనను సత్కరించడం సంతోషంగా ఉందని… ఇలాగే ప్రోత్సాహం అందిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తానని చెప్పింది.

sakshi 2

తాను విజయం సాధించాలని ప్రజలందరు ఆకాంక్షించారని….వారందరి దీవెనలతో పతకం సాధించానని తెలిపింది.భారత్ కు పతకం అందించాలన్నదే తన కల అని…దీనికోసం 12 సంవత్సరాలుగా కష్టడ్డానని తెలిపింది. భారత్ కు పతకం అందించినందుకు గర్వంగా ఉందని…మరిపోలేని క్షణమని వెల్లడించింది. తనకు ఘనస్వాగతం పలికిన అధికారులకు, అభిమానులకు థాంక్స్ చెప్పింది.

sakshi 3