నన్ను ఎత్తుకెళ్తారనుకోలేదు..

233
- Advertisement -

మధ్యప్రదేశ్‌ లోని పన్నా జిల్లాలో గత ఆదివారం వరద ప్రాంతాల పరిశీలనకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ కాలువ దాటే క్రమంలో చౌహాన్‌ను భద్రతా సిబ్బంది తమ చేతులతో ఎత్తుకుని కాలువ దాటించారు. ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో విపక్షాలతో పాటు, నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో వరద నీటిని దాటించేందుకు భద్రతా సిబ్బంది తనను ఎత్తుకున్న ఘటనపై చౌహన్‌ వివరణ ఇచ్చారు. ‘పన్నాలో వరద నీటికి అవతలి వైపున్న చిన్న వంతెనపై గ్రామస్థులు ఉన్నారు. నేను వారిని కలుసుకునేందుకు అటు వైపుగా నడుస్తున్నాను. ఇంతలో సిబ్బంది నన్ను వారి చేతులతో ఎత్తి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందో నేను గుర్తించి, స్పందించేలోగానే అంతా జరిగిపోయింది’ అంటూ చౌహాన్‌ వివరించారు. వాళ్లు ఎత్తుకోబోతున్నారన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పారు.గతంలో ఎన్నోసార్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని కానీ ఆ ఒక్క ఫోటో మాత్రమే హైలెట్ అవుతుందన్నారు చౌహాన్‌.

shivaraj singh

మరోవైపు చౌహన్‌ పై వస్తున్న విమర్శలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మిశ్రా  ఖండించారు. ముఖ్యమంత్రికి ‘జెడ్‌’ కేటగిరీ భద్రత ఉంటుందని.. ఆయనకు నీటిలో విషపూరిత జంతువుల నుంచి హానికలగకుండా రక్షించాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిపై ఉందని అందుకే వారు ఆయనను మోసుకెళ్లారని మిశ్రా వివరణ ఇచ్చారు.

- Advertisement -