- Advertisement -
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాడు ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.
తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లను రాబట్టింది ఈ మూవీ. అన్ని ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమా 18 కోట్ల రేషియోలో బిజినెస్ జరిగితే అందులో నుంచి దాదాపు 22 కోట్ల షేర్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి థియేటర్ల వైపు నుంచి 4 కోట్ల లాభం వచ్చింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడం .. పాటలు బాగుండటం .. పండుగ సీజన్లో రిలీజ్ కావడం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.
- Advertisement -