రైతు కుటుంబానికి అండగా ‘లవ్ స్టోరీ’ దర్శకుడు..

46

టాలీవుడ్‌ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల రీసెంట్‌గా ‘లవ్ స్టోరీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆయన సెన్సిబుల్ డైరెక్టరే కాకుండా.. తాను చాలా సెన్సిటివ్ కూడా అని ఇటీవల జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా నిరూపించుకున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కప్పల లక్ష్మయ్య అనే రైతు ఇల్లు అగ్నికి ఆహుతైంది. బీరువాలో దాచుకున్న రూ.6 లక్షలు కూడా కాలిబూడిదయ్యాయి. పూరిల్లు కోల్పోవడం, దాచుకున్న డబ్బు మంటల్లో కాలిపోవడంతో రైతు లక్ష్మయ్య వేదన వర్ణనాతీతం.

ఈ వార్త మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఆ రైతు పరిస్థితి గురించి శేఖర్ కమ్ములకు తెలిసింది. ఆయన ఎంతో చలించిపోయారు. వెంటనే రైతు కుటుంబంతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అంతేకాదు, రైతు లక్ష్మయ్య ఖాతాకు రూ.1 లక్ష బదిలీ చేశారు. తమ దీనస్థితి పట్ల స్పందించడమే కాకుండా, లక్ష రూపాయలు పంపిన దర్శకుడు శేఖర్ కమ్ములకు రైతు లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.