పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ..

119
Minister harish rao

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్, అతిథి గృహంతో పాటు, నూతన అంబులెన్స్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వీరి వెంట ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ :నిత్యం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో రెండు నూతన అంబులెన్సులను మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు.

గ్రామీణ పేద ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే 2 అంబులెన్సులు ఉన్నాయని, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు మరో రెండు అంబులెన్సులను నూతనంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలు అత్యవసర సమయంలో 108ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.