దీపావళి టపాసుల వెలుగులు చూస్తూ పిల్లలు గంతేసినట్లు.. ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిమంతమైన మిస్సైళ్లు పేల్చుతూ ఆనందిస్తాడు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. మొదటిది సంతోషమైతే, రెండోది క్రూరత్వం.. ఉన్మాదం తలకెక్కిన నియంతృత్వం మూడోది. ఇక ఓ వైపు ప్రపంచమంతా అణు పరీక్షలు జరపద్దంటూ అమెరికా హెచ్చరికలు చేస్తున్నా వినకుండా క్షిపణి ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు కిమ్. ఇక తాజాగా ఆ దేశ అథ్లెట్లను కూడా వదల్లేదు. రియో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఐదు స్వర్ణాలతో సహా 17 పతకాలు తేవాలని ఆజ్ఞాపించారు కిమ్. కానీ ఆ దేశ అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు మాత్రమే తెచ్చారు.
దీనికి తోడు దాయాది దేశం దక్షిణ కొరియా చేతిలో కొన్ని ఈవెంట్లలో ఓడిపోయారు. దీంతో కిమ్‌కు కోపమొచ్చింది. మెడల్స్ గెలిచిన వాళ్లకు మంచి ఇళ్లు, కార్లు, డబ్బులో ముంచెతుతున్న కిమ్.. పతకాలు తేని అథ్లెట్లంతా వెళ్లి బొగ్గు గనుల్లో పని చేయాలని ఆదేశించారు. మళ్లీ పతకం తీసుకొస్తేనే వారికి మర్యాదలు ఉంటాయని హెచ్చరించాడు.