తమన్నా పెళ్లి పై కొత్త పుకార్లు

27
- Advertisement -

మిల్క్ బ్యూటీ తమన్నా’ పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమెకు మంచి విజయాలు కూడా వస్తున్నాయి. దాంతో, తమన్నా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? గత రెండేళ్లుగా తమన్నా, విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వచ్చే నెలలో తమన్నా – విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. అందుకే తమన్నా మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు.

అలాగే, ఇంకా తమన్నా ఏ హిందీ సినిమాకి కూడా సైన్ చెయ్యలేదు కాబట్టి.. బహుశా ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. దాంతో తాజాగా తమన్నా తన పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెడుతూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. తాను మరో రెండేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. అయితే, తాను ప్రస్తుతం తెలుగు సినిమాలను కొత్తగా అంగీకరించక పోవడానికి ప్రధాన కారణం హిందీ సినిమాలతో బిజీగా ఉండటమేనట.

ఏది ఏమైనా తమన్నా వ్యక్తిత్వం చిన్న పిల్లలా ఉంటుందని టాక్ ఉంది. అసలు తమన్నా ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఒక హిందీ హీరోతో ఆమె ప్రేమలో పడింది. కానీ, చివరకు విజయ్ వర్మతో సెటిల్ అయ్యింది. తమన్నాకి ఉన్న మరో మంచి లక్షణం ఆమె చాలా సెన్సిటివ్. చిన్న విషయాలకు కూడా ఆమె ఎమోషనల్ అయిపోతారు. పైగా ఓ ట్రస్ట్ కూడా నడుపుతుంది. ఇవన్నీ తెలిసిన నెటిజన్లు ఈమెది ఇంత ప్యూర్ హార్ట్ ఏంట్రా బాబు అంటూ ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:అదృష్టమంటే ఈ కుమారి దే..

- Advertisement -