చెన్నై సూపర్ కింగ్స్ తన పవరేంటో మరోచూపించింది. ఈ సీజన్లో దూకుడును కొనసాగిస్తున్న క్రమంలో గత మ్యాచులో ఓటమిని చవి చూడటంతో తన పవరేంటో మరోసారి తెలియాజేసింది. నిన్న (సోమవారం) చెన్నై-ఢిల్లీ డేర్‌డేవిల్స్ మధ్య జరిగిన మ్యాచులో 13 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డేవిల్స్ పై చెన్నై విజయం సాధిందించింది. వాట్సన్, ధోని, రాయుడుల బ్యాటింగ్‌తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. మెరుపు వేగంతో తన అద్భుతమైన ఆట తీరుతో ఆకట్ట్టుకున్నారు చైన్నై ఆటగాళ్లు.
ముందుగా టాస్ బ్యాటింగ్‌కు దిగిని చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. వెటరన్ షేన్ వాట్సన్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ధోనీ మళ్లీ చెలరేగటంతో 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 నాటౌట్‌గా నిలిచారు. అంబటి రాయుడు 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 41తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తన మార్కు షాట్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించటంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో నెగ్గింది.
భారీ లక్ష్య ఛేదనలో రంగంలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 రన్స్ చేసింది. రిషభ్ పంత్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అతని ప్రయత్నాలు ఫలించలేదు. విజయ్ శంకర్ (31 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 54 నాటౌట్‌గా నిలిచారు. మొత్తానికి తన ఆట తీరుతో చెన్నై అద్భుతాన్ని కనబరిచిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.