డిసెంబర్ 31న.. ‘అర్జున ఫల్గుణ’

25
sree vishnu

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.

నూతన సంవత్సరం సందర్బంగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌లతో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. త్వరలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక బృందం
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత : ఎన్ ఎమ్ పాషా
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని
డైలాగ్స్ : సుధీర్ వర్మ. పి
సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి
ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్
యాక్షన్ : రామ్ సుంకర
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
లిరిక్స్ : చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్ : అనిల్&భాను
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి