లాటరీ పద్దతిలో ఇండ్లు కేటాయింపు: కేటీఆర్

23
ktr

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని,లాటరీ పద్దతిలో కేటాయిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని సూచించారు. రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు.

తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్‌ 10 రెట్లు పెంచామని, తెలంగాణ వచ్చాక విద్యుత్‌, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు.