టీఆర్ఎస్‌లోకి టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి

708
ktr bn reddy
- Advertisement -

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత,టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పిన కేటీఆర్ ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసానితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

ఇప్పటికే గ్రేటర్‌కు చెందిన టీడీపీ నేతలు కారెక్కిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుండి గెలిచిన ఏకైక కార్పొరేటర్ శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

ఇప్పటికే సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక సాధారణ ఎన్నికల్లో పోటీచేయక పోవడం ఇదే ప్రథమం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు స్ధానాల్లో టీడీపీ గెలవగా అందులో ఒకరు టీఆర్ఎస్‌కు జైకొట్టారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అసలు బరిలోనే నిలవలేదు.

- Advertisement -