టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

125
delhi capitals

అబుదాబి వేదికగా ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌,, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. హ్యాట్రిక్‌ విజయం సాధించాలని ఢిల్లీ ఉత్సాహంతో ఉండగా టోర్నీలో బోణీ చేయాలని సన్‌రైజర్స్‌ పట్టుదలతో ఉంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

ఇక ఢిల్లీ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో నెగ్గి టేబుల్ టాపర్ గా నిలిచింది. అదే సమయంలో రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. ఇప్పుడీ రెండు జట్లు తలపడనున్న నేపథ్యంలో సహజంగానే గెలుపు అవకాశాలు ఢిల్లీ జట్టు వైపు మొగ్గు చూపుతున్నాయి.

కాగా గాయం నుంచి కోలుకున్న స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. సన్‌రైజర్స్‌ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిట్‌నెస్‌ సాధించిన కేన్‌ విలియమ్సన్‌ ఎట్టకేలకు ఇవాళ మ్యాచ్‌ ఆడుతున్నాడు. వృద్ధిమాన్‌ సాహా స్థానంలో అబ్దుల్‌ సమద్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (C), శ్రేయాస్ అయ్యర్ (WC), షిమ్రాన్ హెట్మీర్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అన్రిచ్ నార్ట్జీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (డబ్ల్యూ), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కె ఖలీల్ అహ్మద్, టి నటరాజన్