కేసీఆర్‌కు కృతజ్జతలు.. మహిళ రైతుల ర్యాలీ..

126
Women Farmers

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిన నూతన రెవిన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కల్లూరు మండల వేలది మంది మహిళ రైతులు భారీ ర్యాలీని చేపట్టారు. రైతుల పక్షపాతి కేసీఆర్ గారికి కృతజ్జత తెలుపు ప్లకార్డులను ప్రదర్శిస్తూ మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షత వహిస్తూ ర్యాలీని ముందుకు నడిపారు. రైతుల సంక్షేమం కొరకు ఎన్నో నూతన సంస్కరణలను తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞత ర్యాలీని చెప్పటామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.