జయప్రకాశ్ మృతి పట్ల పీఎం మోదీ సంతాపం..

91
modi

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జయప్రకాశ్ రెడ్డి గారు తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. తన దీర్ఘకాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని, వారి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను… ఓం శాంతి అంటూ స్పందించారు.

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల ట్వీట్ చేశారు. గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి గారి అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం అని కీర్తించారు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అమిత్‌ షా పేర్కొన్నారు.