హీరోయిన్ సంజన అరెస్ట్‌..!

89
sanjana

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ మాఫియా వ్యవహారం ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు పాకింది. ఈ వ్యవహారంలో తాజాగా హీరోయిన్ సంజనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని సంజన నివాసంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులను నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీబీ ఆఫీస్‌లో ఆమెను విచారిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే సంజన స్నేహితుడు రియల్టర్ రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్‌కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు అధికారులు తేల్చారు.

తమ విచారణలో రాహుల్ పలు వివరాలను వెల్లడించాడని ఈ సందర్భంగా సీసీబీ వర్గాలు తెలిపాయి. సంజన, రాహుల్ ఇద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో పాల్గొనే వారని, పొరుగు దేశాల్లోని పలు కేసినోలకు వెళ్లేవారని చెప్పాయి. పార్టీలను నిర్వహించడం, డ్రగ్స్ ను సరఫరా చేయడం వంటి అభియోగాలను రాహుల్ పై మోపినట్టు తెలిపారు. ఇప్పుడు సంజనను విచారిస్తున్నామని చెప్పారు. ఇక సంజన తెలుగులో తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించింది.