ప్రధానమంత్రి నరేంద్రమోడీకి..66వ పుట్టినరోజు మరచిపోలేని జ్ఞాపకంగా మిగలనుంది. ఆయన పుట్టిన రోజున.. ధూంధాంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రధాని మోడీ తన 66 జన్మదినోత్స వాలను సొంతగడ్డపై జరుపుకుంటుండటంతో గుజరాత్లో సందడి వాతావ రణం నెలకొంది. ఉదయమే మోడీ తన మాతృ మూర్తి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత గిరిజనులు, దివ్యాం గుల మధ్య పుట్టినరోజు సంబరాలు జరుపుకోనున్నారు. మోడీ పుట్టిన రోజు సంబరాలను గిన్నిస్ రికార్డుల్లో చేర్చాలన్న లక్ష్యంతో సర్వం సిద్ధం చేశారు.
మోడీ 66వ జన్మదినం సందర్భంగా సూరత్ కు చెందిన ఒక బేకరీ ఏకంగా 3750 కేజీల కేక్‌ను తయారుచేయించింది. అతుల్ బేకరి, శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రపంచంలోనే అతి పొడవైన బర్త్ డే కేక్ తయారు చేసింది. మహిళా సాధికారత కోసం పని చేసే శక్తి ఫౌండేషన్ ప్రధాని నరేంద్ర మోడీ బేటీ బచావ్- బేటీ పఢావ్ పథకం ప్రవేశపెట్టినందుకు గౌరవ సూచకంగా ఈ భారీ కేక్ తయారు చేసి గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నించనుంది. ఈ కేక్‌ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన మహిళలతో కట్ చేయించనున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలోనే ఇదివరకెన్నడూ లేని విధంగా దాదాపు 11 వేలమందికి పైగా దివ్యాంగులకు సహాయ పరికరాలను అందించ బోతున్నారు. గుజరాత్ లోని నవసరి జిల్లా కలెక్టర్ రవి అరోరా ఆధ్వర్యంలో.. ప్రధానమంత్రి కార్యాలయం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించనుంది. గిన్నిస్ పరిశీలకులు.. ఈవెంట్ ను లైవ్ గా పరిశీలించనున్నారు.
వెయ్యిమంది దివ్యాంగులు ఒకేసారి 989కి పైగా ఒకేసారి దీపాలను వెలిగించి మోడీకి బర్త్ డే విషెస్ చెప్పారు. వెయ్యి మంది దివ్యాంగులు ఒకేసారి దీపాలను ప్రజ్వలన చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
నాగ్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీని పోలిన జీతెంద్ర వ్యాస్…కేక్ కట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో కలిసి రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించి….మోడీని అనుకరించే ప్రయత్నం చేశారు.