చైతు-సామ్ తెగ కష్టపడుతున్నారు..

324
samantha naga chaitanya
samantha naga chaitanya
- Advertisement -

సమంత- నాగచైతన్యలు మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నారన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి పెళ్ళిపై ఇన్నాళ్ళు కాస్త సందేహం నెలకొన్న రీసెంట్‌గా నాగ్ ఇచ్చిన ఇంటర్యూతో తేటతెల్లమైపోయింది. తాజాగా వీళ్లు జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే వీళ్లకి ఫిట్‌ నెస్ మీద ఎంత దృష్టో అర్థమవుతుంది. ఇక పెళ్లి తరువాత ఇంకా ఫిట్‌గా కనబడాలని కావచ్చు ఇంతలా జిమ్‌లో కష్టపడుతున్నారు కాబోయే భార్య భర్తలు.

ఇక జనతా గ్యారేజీ సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత మ్యారేజ్ తరువాత సినిమాలకు దూరంగా వుంటోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ అసలు కారణం అదికాదని, మంచి రోల్స్ రాకపోవడం వల్లే సినిమాల్లో నటించడం లేదని మనసులోని మాటను బయటపెట్టింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ర్టీలో హీరోయిన్లకు అర్థవంతమైన పాత్రలు దొరకటం ఎంత కష్టమో ఇప్పుడే అర్థమవుతోందని అంటోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలు మాటేంటి? ఇంతకీ మ్యారేజ్ తర్వాత వెండితెరపై నటిస్తారా? లేదా? అంటూ సోషల్ మీడియా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు అభిమానులు.

- Advertisement -