క్యాస్టింగ్ కౌచ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు..!

63
actress apporva

తెలుగు సిన్మాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న నటీమణుల్లో అపూర్వ ముందు వరుసలో ఉంటారు. అల్లరి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అపూర్వ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు…ఎక్కువగా వ్యాంపు తరహా పాత్రల్లో మెరిసిన ఈ భామ మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ గురించి అపూర్వ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఆ ఇంటర్వ్యూలో అపూర్వ చెప్పుకొచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే అమ్మాయిలకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవని కుండబద్ధలు కొట్టింది. అయితే ఆ ఇబ్బందులని అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కొనాలని సూచించింది. ఒక్కసారి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తే ఆ తర్వాత మనల్ని ఎవరూ టచ్ చేయరు అని చెప్పింది.

నేను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అల్లరి తర్వాత నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఓ చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు నన్ను కొంత మంది డైరెక్ట్‌గా పడుకోమని అడిగారు. అయితే నేను ఒప్పుకోకపోవడంతో ఇక్కడకు వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా అన్నారంటూ అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ ఆ సినిమా నుంచి వారు నన్ను తీసేయకపోయినా సెట్స్ లో మాత్రం సరిగా సహకరించకుండా ఇబ్బంది పెట్టారంటూ ఆమె వాపోయింది. ఎవరైనా నటుడితో మనకు చనువు ఏర్పడితే.. ఏం అపూర్వ ఈ రోజు లాంగ్ డ్రైవ్ కు వెళదాం, డిన్నర్ కు వెళదామా అని అడుగుతారు.

అది చనువు వల్ల మత్రమే..కాని లైంగికంగా ఇబ్బంది పెట్టరు అని, మన స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవరూ ఏం చేయలేరని అపూర్వ తెలిపింది. ఇక టాలీవుడ్ హీరోయిన్లు నిత్యామీనన్, భూమిక లాంటి హీరోయిన్ల గురించి అపూర్వ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నిత్యామీనన్, భూమికకు ఎలాంటి వేధింపులు ఎదురై ఉండవు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం అలా ఉంటుంది.. అదే విధంగా కెరీరీ స్టార్టింగ్‌లోనే వాళ్ళు సక్సెస్ చూశారని అపూర్వ తెలిపింది. భూమికని నేను దగ్గరుండి చూశా.. ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సెట్స్ లో ఆమె దగ్గరకు హీరో వెళ్లాలన్నా భయపడతారు. అది భూమిక క్యారెక్టర్. ఆమె అద్భుతమైన అమ్మాయి అని అపూర్వ ప్రశంసలు కురిపించింది. మొత్తంగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి, హీరోయిన్లు భూమిక, నిత్యామీనన్‌ల గురించి అపూర్వ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.