ఆ వెదవ వల్లే నా జీవితం నాశనమైంది.. !

37
ashu reddy

డబ్ స్మాష్ వీడియోలతో పేరు తెచ్చుకున్న నటి అషురెడ్డి. తర్వాత బిగ్ బాస్‌లోకి ఎంట్రీతో ఈ అమ్మడు కెరీర్ మారిపోయిన అషు… ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఓ వెదవ వల్లే నా జీవితం నాశనం అయిందంటూ ఓ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది.

ఏదో షో కోసం స్కూల్ యూనిఫామ్ ధరించిన అషు. తన పక్కన కో-డైరెక్టర్ రాకేష్‌తో పాటు మరో వ్యక్తి ఉండగా.. వారితో ‘ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా.. వాడి వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్లమీద తిప్పితిప్పి పిప్పి చేశాడు’ అంటూ బ్రహ్మానందం డైలాగ్‌తో డబ్ స్మాష్ వీడియో చేసింది. అంతేకాదు ఇది రియల్ అని ఆమె ట్యాగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది.