పప్పు పదం…ఇకపై అసెంబ్లీలో నిషేధం!

173
mp
- Advertisement -

రాజకీయాల్లో పప్పు అనే పదం ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ, ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్‌ని పప్పు అని పలుమార్లు విపక్ష పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగానే విమర్శించిన సందర్భాలు ఎన్నో. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.

పలు పదాలను అసెంబ్లీలో వాడకూడదని వెల్లడించింది. ఇందులో పప్పు, చోర్‌, మిస్టర్‌ బంటాధార్‌, వెంటిలేటర్‌ వంటి పదాలున్నాయి. ఏయే పదాలను సభలో వాడకూడదో పేర్కొంటూ జాబితాను అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేశారు. ఇందుకు సంబంధించి 38 పేజీల బుక్‌లెట్‌ను సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆదివారం విడుదల చేశారు.

- Advertisement -