Paris Olympics: జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా

11
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి రేసులో దూసుకెళ్తున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

గ్రూప్-ఎలో ఫైనల్స్‌కు అర్హత సాధించి మొదటి స్థానంలో నిలిచిన జర్మనీ క్రీడాకారుడు 87.76 మీటర్లు విసరగా నీరజ్ 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్ చేరారు. ఆగష్టు 8వ తేదీన జరిగే ఫైనల్స్‌లో పతకం కోసం పోటీపడనున్నాడు.

Also Read:KTR:తెలంగాణ ఉద్యమానికి అండగా జయశంకర్ సార్

- Advertisement -