హ్యాపీ బర్త్ డే ‘కరాటే కింగ్’

357
- Advertisement -

ఆరడుగుల ఎత్తు…హీరో అనే పదానికి అసలైన రూపం..కరాటేలో బ్లాక్ బెల్ట్…సినిమా ఛాన్స్ కోసం సుమన్ పెద్దగా కష్టపడలేదు… చూడగానే ఆకర్షించే అతని అందం, ఫిజిక్ తో సినిమాలే ఆయన వెంట పడ్డాయి. మొదటి సినిమా ఛాన్స్ తమిళంలో (నీచల్ కులం-పోలీస్ ఆఫీసర్) అనుకోకుండా ఓ స్నేహితుడి ద్వారా వచ్చింది. తెలుగులో తరంగణి మొదటి సినిమా.ఎన్టీఆర్ తర్వాత దేవుడి పాత్రలకు సరిగ్గా సరిపోయిన నటుడు సుమన్. హాలీవుడ్ సినిమాలో నటించిన మొదటి నటుడు కూడా ఆయనే. ఇవాళ సుమన్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

‘నేటి భారతం’ లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమాతో హీరోగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో అనేక సినిమాల్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ గానే నటించాడు. మొత్తం ఒక హాలీవుడ్ సినిమా(డెత్ అండ్ టాక్సిస్)తో కలిపి దాదాపు 150 సినిమాలకు పైగా నటించాడు. ఒక సందర్బంలో తెలుగమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన సుమన్ అన్న మాట ప్రకారం డి.వి. నరసరాజు మనుమరాలు శిరీష ను పెళ్ళి చేసుకున్నాడు. ఈయనకు ఓ కుమార్తె.

maxresdefault (1)

మంగుళూరుకు చెందిన సుమన్ తల్వార్ చెన్నైలో జన్మించాడు (1959 ఆగస్టు 28). ఈయన తల్లి, కేసరీ చందర్ మద్రాసులోని యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేశారు. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. సుమన్ బాల్యంలో మద్రాసులోని చర్చ్‌ పార్క్ కాన్వెంటులో ప్రైమరీ, బీసెంట్ థియొసోఫికల్ టెంత్ పూర్తి చేశాడు. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో బీ.ఏ (ఇంగ్లీష్) చదివాడు.

suman
పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటిస్తేనే మంచి గుర్తింపు వస్తుంది అన్న సూత్రాన్ని సుమన్‌ బాగా నమ్ముతారు. అందుకే అప్పటివరకు హీరో పాత్రలతో బిజీగా ఉన్న సుమన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘శివాజీ’ సినిమాలో విలన్‌ పాత్రలో నటించారు. ముందు విలన్‌ అనగానే కంగారుపడ్డా.. తర్వాత దర్శకుడు శంకర్‌ స్క్రిప్ట్‌ చెప్పగానే ఒప్పుకొన్నారు. ఈ సినిమా విడుదలయ్యాక అందరూ ‘రజనీకి ధీటుగా నటించాడు’ అని ప్రశంసిస్తుంటే పట్టరాని ఆనందం కలిగిందని ఇప్పటికీ చెప్తుంటారు సుమన్‌.

Tollywood Celebrities Meet Narendra Modi

కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న తరుణంలోనే అనుకోని విధంగా ఓ నీలిచిత్రాల నిర్మాణం స్కాంలో చిక్కుకొని కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాడు. కానీ చివరకు దాన్నుండి విజయవంతంగా బయటపడ్డాడు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ ఆయనను ఆహ్వానించి ఎన్నో ఛాన్సులు ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణిస్తు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్నాడు. ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నా… అందులో తరంగిణి, నేటి భారతం, 20వ శతాబ్దం, బావ బావమరిది, సితార, మెరుపుదాడి, ఆత్మబలం, అలెగ్జాండర్, అన్నమయ్య, దేవుళ్ళు, శ్రీరామదాసు, లీడర్ వంటివి బాగా గుర్తిండిపోయే సినిమాలు.

Suman

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ ధీశాలి. అంతేకాదు పరిణతి గల వ్యక్తి కూడా. అభిమానులు ‘కరాటే కింగ్‌’ అని పిలుచుకునే సుమన్‌ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.

suman

- Advertisement -