హైదరాబాద్ లో కాల్పుల కలకలం

200
Gun Fire In Marriage Celebrations Old City
Gun Fire In Marriage Celebrations Old City
- Advertisement -

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఫలక్ నుమాలో కాల్పులు కలకలం రేపాయి. పెళ్లి బరాత్ లో పెళ్లి కొడుకు గాల్లోకి కాల్పులు జరిపాడు. రెండు రివాల్వర్లతో 10 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. గత నెలం 22 న రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరిగినట్టు సమాచారం. పెళ్లి కొడుకు ఇలా కాల్పులు జరిపేతే బంధువులు, స్నేహితుల తీన్మార్ స్టెప్పులతో ఎంజాయ్ చేశారు.

ఆగస్టు 22న రాత్రి 10 గంటలకు ఘటన జరిగితే ఇప్పటి వరకూ పోలీసులు స్పందించలేదు. కాల్పుల ఘటన జరగలేదని, వదంతులు నమ్మ వద్దని తొలుత దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

కాల్పుల దృశ్యాలు ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. పాతబస్తీలోని షామా థియేటర్‌ ఎదుట కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఆత్మ రక్షణ పేరుతో ఇలా గన్ లైసెన్స్ తీసుకొని హల్ చల్ చేస్తున్నారు. వేడుకల్లో ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరుపుతూ జనం ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఫలక్ నుమా కాల్పుల ఘటనతో అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇష్యూలో పెళ్లి కొడుక్కి గన్ లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి.

- Advertisement -