విద్యార్థుల సమస్యలు, కళాశాలలు సమస్యలపై ప్రభుత్వం దాటవేత దోరణి అవలంబిస్తుంది అని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు తెలిపారు. ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు..సీఎం ఆఫీసు ను బ్లేమ్ చేస్తున్నారు..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 600 కోట్లు దసరాకు, మిగతా 600 కోట్లు దీపావళికి ఇస్తామని మీడియా ముఖంగా చెప్పారు..డిప్యూటీ సీఎం ఆఫీస్, ఫైనాన్స్ ఆఫీసు అన్ని ఆఫీసులు అన్నారు.
200 కోట్లు ఇచ్చినమ్ము అని చెబుతున్నారు..రాష్ట్రంలో విద్యా ఉన్నదా లేదా, విద్యాసంస్థలు నడుస్తున్నాయా లేదా అనుమానం కలుగుతుంది..విద్యా రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది..మాకు 10 వేల కోట్లు రావాలి..కోటి రూపాయలు రావాల్సిన కళాశాలకు లక్ష రూపాయలు వరకు మాత్రమే వచ్చాయి..ప్రభుత్వానికి బాధతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు.
ఈరోజు 200 కోట్లు ఇచ్చారు ఇంకా వేయి కోట్లు రావాలి..ఈ నెల 12 వ తేదీ వరకు మిగతా బకాయిలు రాకపోతే నిరవదిక బంద్ కొనసాగిస్తాం…ఈ రోజు నుండి సీఎం ఆఫీసు తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళము..సీఎం అపాయింట్మెంట్ తీసుకొని మా సమస్యలు పరిష్కరించుకుంటాం..ఈ ప్రభుత్వం కళాశాలల విషయంలో శీతకన్ను వేసింది అన్నారు.
దీపావళికి మిగతా వేయి కోట్లు ఇవ్వాలి..లేని యెడల 12 నుండి 18 మధ్యలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం..విద్యా రంగానికి ప్రభుత్వం ఇచ్చే పాత్ర సీఎం చెప్పాలి…సీఎం రేవంత్ రెడ్డి కళాశాలలకు ఉన్న అపోహలు తొలగించాలి..12 వ తేదీలోపు మిగతా 1000 కోట్లు ఇవ్వకపోతే 13 నుండి యాజమాన్యాలు స్ట్రైక్ చేస్తాయి అన్నారు.వివిధ రూపాల్లో మా నిరసన చెబుతాం..స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్ కలిపే మా నిరసన తెలుపుతాం అన్నారు.
Also Read:అశికా రంగనాథ్..”గత వైభవ”

