విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ఇవాళ తిరుపతి వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఏదైనా మాట్లాడేటప్పుడు తాను ఆచితూచి మాట్లాడతానని అన్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించారు. ప్రధాని మోదీకి, తెలుగుదేశానికి భజనసేన అని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సినిమాల్లోనే గబ్బర్‌సింగ్ రాజకీయాల్లో రబ్బర్‌సింగ్ అంటూ తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే వీటన్నింటినీ పడాల్సిన అవసరం ఉందనీ, పడతానని పేర్కొన్నారు.
అయితే రోజాకు ఇతరులను విమర్శించడం కొత్తేమి కాదు.. ఆమె ఇది వరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలను బహిరంగంగానే విమర్శించింది. ఇంటా బయట అన్నట్లు, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల టీడీపీ పార్టీ నాయకులను విమర్శించి అబాసుపాలైంది. అంతే కాకుండా టీడీపీ పార్టీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యేను తీవ్రంగా విమర్శించి సస్పెన్షన్‌కు గురైంది. సాక్ష్యాత్తు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండే రోజా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ కానీ నిజ జీవితంలో, రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్” అని వ్యాఖ్యానించింది.
అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో, దేనిలోనూ పవన్ కళ్యాణ్ నిరూపించుకోలేక పోతున్నాడు, కనీసం ప్రతేయక హోదా కోసం అయినా మాట్లాడే పాపాన పోలేదు. ఈసారైనా తను ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ నేత జగన్ తో కలిసి పోరాటం చేయాలనీ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై పవన్ తిరుపతి సభలో స్పందించాడు.