మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారటం చుట్టారు. దాదాపు రూ.150 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని శిల్ప సంపదను తిలకించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రామప్ప చెరువు కట్ట వద్దకు చేరుకొని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించి, అకడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read:NBK Birthday:నరసింహనాయుడు రీ రిలీజ్
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే