2017లో ఒక ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఆరవేళ్లపాటు సాగిన న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ, కేరళ ఎర్నాకుళం జిల్లా & ముఖ్య సెషన్స్ కోర్టు నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించింది. జడ్జి హనీ ఎం. వర్గీస్ నేతృత్వంలోని కోర్టు శుక్రవారం ఉదయం 11 గంటలకు తీర్పును ప్రకటించింది. ఈ కేసులో దిలీప్ ఆరోపణల జాబితాలో 8వ నిందితుడిగా ఉన్నాడు.
దిలీప్‌పై సాక్ష్యాలను నాశనం చేసినట్లు కూడా అదనపు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పుల్సర్ సుని, మార్టిన్ ఆంటోని, మణికందన్ బి., విజయేష్ వి.పీ., సలీం ఎచ్., ప్రదీప్, చార్లీ థామస్, సనిల్ కుమార్ (మెస్త్రీ సనిల్), శరత్, మరియు దిలీప్ — మొత్తం పది మంది నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు.
వీరిగురించి IPCలోని పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు అయ్యాయి:
120A, 120B (కుట్ర)
109 (నేరానికి ప్రోత్సాహం)
366 (మహిళను అపహరించడం)
354, 354B (మహిళపై దాడి/నగ్నం చేసేందుకు ప్రయత్నం)
357 (బలవంతంగా నిర్బంధించడం)
376D (గ్యాంగ్ రేప్)
201 (సాక్ష్యాలను నాశనం చేయడం)
212 (నేరస్తుడిని దాచిపెట్టడం)
34 (సామూహిక ఉద్దేశం)
ఇందుకు తోడు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66E (సమ్మతి లేకుండా ప్రైవేట్ ప్రాంతాల ఫొటోలు తీయడం/పంపించడం) మరియు 67A (అశ్లీల వీడియోలు/మెటీరియల్ ఎలక్ట్రానిక్‌గా పంపడం) కింద కూడా కేసులు నమోదు అయ్యాయి.
2017 ఫిబ్రవరి 17న కొచ్చిలో కారులో ప్రయాణిస్తుండగా, ఆ నటి అపహరణకు గురై దాదాపు రెండు గంటలపాటు లైంగిక వేధింపులకు గురైందని ఆరోపణలు. ఈ ఘటన ఆధారంగా అపహరణ, లైంగిక దాడి, గ్యాంగ్ రేప్, సాక్ష్యాల నాశనం, ఐటీ చట్ట ఉల్లంఘన వంటి ఎన్నో తీవ్ర ఆరోపణలు నమోదు అయ్యాయి. కేసులో తొలి చార్జ్‌షీట్ 2017 ఏప్రిల్‌లో దాఖలైంది. దిలీప్ 2017 జూలైలో అరెస్టయ్యాడు, పుల్సర్ సునితో అతనికి సంబంధం ఉందని ఇన్వెస్టిగేటర్లు ఆరోపించడంతో. అనంతరం అక్టోబర్ 2017లో జైలు బెయిల్‌పై విడుదలయ్యాడు. అదే ఏడాది సప్లిమెంటరీ చార్జ్‌షీట్ కూడా దాఖలైంది. విచారణలో కొంతమంది నిందితులు డిశార్జ్ అయ్యారు, మరికొందరు అప్రూవర్‌లుగా మారారు. ఎట్టకేలకు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
Also Read:MSG:ట్రెండింగ్‌లో శశిరేఖ సాంగ్

