యాషెస్ 2025-26 సిరీస్‌లో వరుస విజయాలను సాధిస్తున్న ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ మళ్లీ ఘోర పరాభవం పాలయ్యింది. బ్రిస్బేన్ గబ్బాలో జరిగిన రెండో టెస్టులో నాలుగు రోజుల్లోనే ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత, మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలోకి వెళ్లగా, ఇంగ్లండ్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో కొనసాగుతున్న అధ్వాన్న ప్రదర్శనపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో ప్రధానంగా నిలిచిన బాయ్‌కాట్..ఇంగ్లండ్ ఈ అషెస్ సిరీస్‌కు పూర్తిగా అన్‌ప్రిపేర్డ్‌గా వచ్చిందని, బ్రిస్బేన్ మ్యాచ్ పూర్తిగా హారర్ షోలా ఉందని వ్యాఖ్యానించారు.
బ్రిస్బేన్ హారర్ షోలా మారింది—బాధ్యతారహిత బ్యాటింగ్, చెత్త బౌలింగ్, అందిన క్యాచ్‌లు కూడా వదిలిపెట్టడం. ఈ ఆస్ట్రేలియా జట్టును ఓడించే అవకాశం ఉంది. కానీ ఆరు రోజుల అషెస్ క్రికెట్ తర్వాతే ఇంగ్లండ్‌కు మిరాకిల్ అవసరం అయ్యింది. మాటలు పెద్దగా చెబుతారు కానీ పనిలోకి వస్తే ఏమీ లేదు. ఈ బ్యాటింగ్, బౌలింగ్‌తో అయితే అషెస్ గెలవడం దూరం, గుడ్డు కప్పు కూడా గెలవలేరు అని బాయ్‌కాట్ పేర్కొన్నారు.
బెన్ స్టోక్స్ నాలుగేళ్లుగా ప్లాన్ చేశామని, పూర్తి బ్లూప్రింట్ ఉందని చెప్పారు… ఇవన్నీ అబద్దాలు. ఈ జట్టు ఏమి చెప్తే అది నమ్మలేం. తమ క్యాంప్ వెలుపల ఎవరి మాటలూ వినే స్థితిలో లేరు అన్నారు. ఆటగాళ్లలో ఎవరినైనా డ్రాప్ చేస్తారనే భయం లేకపోవడం వల్లే బ్యాటింగ్ వైఫల్యాలు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ జట్టు సభ్యులు తమే ఆధునిక టెస్ట్ క్రికెట్‌ను అర్థం చేసుకున్నవారని మితిమీరిన నమ్మకం. తప్పు చేసినప్పుడు ఎవరూ మందలించరు, చర్చించరు. కెప్టెన్ మాట—అటాక్, కోచ్ మాట—కీప్ ద ఫెయిత్… అంతే” అని బాయ్‌కాట్ తీవ్రంగా విమర్శించారు.
Also Read:MSG:ట్రెండింగ్‌లో శశిరేఖ సాంగ్

